ఫైనల్ వీక్.. మోనాల్ ను విడిచి ఉండలేకపోతున్న అఖిల్..!

shami
ఓ పక్క బిగ్ బాస్ టైటిల్ పోరులో మరో వారం మాత్రమే ఉంది. 16 మంది డైరెక్ట్ గా.. ముగ్గురు వైల్డ్ కార్డ్ గా మొత్తం 19 మంది కంటెస్టంట్స్ లో టాప్ 5గా అఖిల్, సోహెల్, అభిజిత్, అరియానా, హారిక ఉన్నారు. అయితే ఈ వారంలో వారు టాస్కులేమి చేయరు కాని వారిని ఎంటర్టైన్ చేస్తూ బయట ఆడియెన్స్ కు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం మొత్తం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారే విన్నర్ గా ప్రకటిస్తారు. అయితే ఇలాంటి టైం లో వెళ్లిపోయిన మోనాల్ గురించి బాధపడుతూ వెనకపడుతున్నాడు అఖిల్.

ఈ సీజన్ లో మొదటి ఫైనలిస్ట్ గా అఖిల్ సత్తా చాటగా ఈమధ్య గ్రాఫ్ లో మాత్రం కిందకు వచ్చాడు. విన్నర్ రేసులో కనీసం టాప్ 3లో కూడా లేడు అఖిల్. అంతేకాదు ఫైనల్ వీక్ స్ట్రాంగ్ గా ఉండాల్సిన టైం లో వెళ్లిపోయిన మోనాల్ గురించి బాధపడుతున్నాడు. ఆమెను విడిచి ఉండలేకపోతున్నా అని అంటున్నాడు. టైటిల్ విజేత అవ్వాలన్న కసి కన్నా మోనాల్ ను మిస్ అవుతున్నాడన్న బాధ అఖిల్ లో ఎక్కువ కనిపిస్తుంది.

ఆల్రెడీ మొదటి ఫైనలిస్ట్ అని చెప్పి అఖిల్ ను గత రెండు వారాలూఅ ఆట ఆడకుండా చేశాడు బిగ్ బాస్. ప్రస్తుతం విన్నర్ రేసులో అఖిల్ టాప్ 5లో నాల్గవ స్థానంలో ఉన్నాడు. అతన్ని టికెట్ టు ఫినాలే మెడల్ గెలిచేలా చేసిన సోహెల్ రేసులో దూసుకెళ్తున్నాడు. మరి అఖిల్ మిగిలిన ఈ నాలుగు రోజులైనా ఆట మీద ఫోకస్ పెడితే బెటర్ అని అంటున్నారు అతని ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: