పెళ్లి తర్వాత ఇలా జరుగుతుందని ఊహించలేదు : సమంత
పెళ్లి తర్వాత కూడా సమంత జోరు ఎక్కడా తగ్గలేదు. అయితే సాధారణంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగాలి అంటే గుమ్మడి కాయంత టాలెంటు ఉన్నప్పటికీ కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని చెబుతూ ఉంటారు సినీ పెద్దలు. ఇక అక్కినేని వారి కోడలు సమంత కి ఈ రెండు బాగానే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన సమంత తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకుంది. హీరోయిన్ పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగించగలరు అని నిరూపించుకోవడానికి తాను ఎలాంటి ప్లానింగ్ చేయలేదని పెళ్లి తర్వాత కూడా అవకాశాలు రావడంతో తాను సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది.
తాను కూడా అందరిలాగానే పెళ్లి తర్వాత తనకు అవకాశాలు రావు అని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. కానీ అదృష్టం కొద్దీ పెళ్లయిన కొద్ది రోజులకే రంగస్థలం లాంటి మంచి ఆఫర్ రావడం ఆ తర్వాత మహానటి ఓ బేబీ లాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చిందని ఇవన్నీ తన అదృష్టం వల్ల దక్కాయి అంటూ చెప్పుకొచ్చింది అక్కినేని వారి కోడలు సమంత. సాధారణంగా అయితే ఎంతో మంది హీరోయిన్లకు పెళ్లి తర్వాత అవకాశాలు రావు కానీ సమంత మాత్రం పెళ్ళి తర్వాత కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ యువ హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే.