"మొదటి వెడ్డింగ్ కార్డు మీకే" అంటున్న ప్రముఖ ప్రేమ జంట...!

VAMSI
కొందరు తారలు కెరియర్ పై దృష్టిసారించి ప్రేమ పెళ్లి విషయాలు పక్కన పెట్టి ఫుల్ ఫోకస్ తో ముందుకు వెళ్తుంటారు. మరి కొందరు నటీనటులు అటు కెరియర్ ని ఇటు తమ పర్సనల్ లైఫ్లో ప్రేమ పెళ్ళి అనే ప్రత్యేక విషయాలకు చోటిస్తూ  రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అయితే బాలీవుడ్ సూపర్ లవ్ కపుల్స్ లలో పులకిత్‌ సామ్రాట్‌, కృతి కర్భందాలు  కూడా గొప్ప ప్రేమజంట అనే చెప్పాలి. పులకిత్‌ సామ్రాట్‌, కృతి జంటగా పాగల్‌ పంతీ సినిమాలో నటించారు. ఇటు టాలీవుడ్లోనూ తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్ లీ, బోనీ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది కృతి.

నటుడు పులకిత్ సామ్రాట్ తన ప్రేయసి కృతి ని విడిచి అసలు ఉండలేకపోతున్నాడట. ఈ మాట ఇంకా ఎవరో చెప్పలేదు స్వయంగా సామ్రాట్ "మిస్ యు కృతి" అంటూ తెగ బాధపడిపోతున్నాడు. వీరి ప్రేమ గురించి చెప్పాలంటే... ఆన్ స్క్రీన్ పై ఫుల్ రొమాన్స్ చేసే ఈ జంట... ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి కెమిస్ట్రీ నడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాదిన్నరగా వీరి ప్రేమను కొనసాగిస్తున్న ఈ సెలబ్రిటీ జంట తరచూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా వీటికి సంబంధించిన మరో న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఏకంగా కృతితో తన పెళ్లి గురించి ఒకరి అనుమతి కోసం వెయిటింగ్ అంటూ ఓ ఇంటర్వ్యూలో పులకిత్ వెల్లడించడం మరింత ఆసక్తికరంగా మారింది. తన సోదరి ఇంట్లో  పండగ జరుపుకోడానికి వెళ్లిన పులకిత్‌, తన స్వీట్ హార్ట్ కృతిని చాలా మిస్‌ అవుతున్నట్టుగా వ్యక్తపరిచాడు.

కృతి అంటే తనకు ఎంత ప్రేమో చెప్పకనే చెబుతున్నాడు ఈ కుర్ర హీరో. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పులకిత్ కు మీరు కృతి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అన్న ప్రశ్న ఎదురైంది..... అయినా మన ప్రేమ సామ్రాట్ టక్కున సమాధానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కృతి, నేను ప్రేమలో ఉన్నది నిజమే.  పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాం... కాకపోతే మా సోదరుని అనుమతి కోసమే వెయిట్‌ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మా కెరీర్ పై దృష్టి  ఉంచాం అంటూ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: