బిగ్ బాస్ 4 : ఊహించని విన్నర్.. ఓట్లు తారుమారు..?
ఇక ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరు కాబోతున్నారు రన్నరప్ గా ఎవరు నిలవబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది ప్రస్తుతం బుల్లితెరపై అంతా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే దానిపైనే చర్చ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ కు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఎవరూ ఊహించని వారికి ఈ సారి టైటిల్ లభిస్తుంది అన్న సారాంశం కలిగిన వార్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. వాస్తవంగా అయితే బిగ్ బాస్ టైటిల్ రేసులో గత కొన్ని రోజుల నుంచి అభిజిత్ అందరికంటే ముందున్నాడు.
ఇక అభిజిత్ కు ప్రస్తుతం ఎంతగానో మద్దతు లభిస్తోంది.. అభిజిత్ తర్వాత టైటిల్ రేసులో అఖిల్ సోహెల్ వరుసగా ఉన్నారు. ఒకవేళ అభిజిత్ కి టైటిల్ రాలేదు అంటే అఖిల్ లేదా సోహెల్ కి టైటిల్ వచ్చేఅవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు కానీ ఈ ముగ్గురికి కాకుండా ఈసారి హారిక టైటిల్ గెలుచుకో పోతుంది అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇటీవలే దీనికి సంబంధించిన ఒక అనధికారిక పోస్ట్ కూడా వైరల్ గా మారిపోయింది. ఇక ఈ పోస్టులో నలభై శాతం ఓట్లు హారికకు రాగా తర్వాత స్థానంలో సోహైల్ అఖిల్ అభిజిత్ ఉన్నారు. అరియనా చివర్లో ఉంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఎవరో ఫోటోలను మార్పింగ్ చేశారు అని అభిజిత్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ పోస్ట్ పై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.