స్టైలిష్ స్టార్ ని టాప్ హీరోగా నిలబెట్టిన ఆ సినిమాని ఆ హీరో రిజెక్ట్ చేశాడట..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం "దేశముదురు".ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి బన్నీకి మంచి ఇమేజ్ తీసుకోచ్చింది. అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ  సినిమా  పెద్ద హిట్ అయ్యి యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో  బన్నీ హైపర్ యాక్టింగ్, పూరీ అద్భుతమైన టేకింగ్, హన్సిక అందాలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ కథలో తనను తప్ప ప్రేక్షకులు మరెవరినీ ఊహించుకోలేనంతగా స్టైలిష్ స్టార్  నటనలో ఇరగదీశాడు. అయితే సినిమా కథ ముందు అక్కినేని హీరో సుమంత్ కి చెప్పాడట పూరి జగన్నాథ్..సుమంత్ వద్దకి ఈ కథ వెళ్లిన విషయం చాలామందికి తెలియదు.‘దేశముదురు’ సినిమా కథని పూరీ జగన్నాథ్ ముందుగా సుమంత్‌కే  వినిపించాడట. అయితే సన్యాసి అయిన హీరోయిన్‌ని ప్రేమలోకి దించాలని హీరో ప్రయత్నించే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అని సుమంత్ వెనకడుగు వేసి చెయ్యనని చెప్పాడట.


 దీంతో పూరీ జగన్నాథ్ ఆ కథను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి  చెప్పాడు. ఇక స్టైలిష్ స్టార్ కి తెగ నచ్చిందట. ఇక  వెంటనే అల్లు అర్జున్ సినిమాకి ఓకే చెప్పేయడం జరిగిపోయింది. సన్యాసిగా బ్రతుకుతున్న హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడటం, ఆమెను ఎలాగైనా దక్కించుకునే చేసే సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకుడిగా పూరీకి, హీరోగా అల్లు అర్జున్‌కు మరిచిపోలేని అనుభూతిని పంచింది. చక్రి మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలు అయితే యూత్ ని అమితంగా  ఆకట్టుకున్నాయి. అయినా పాపం సుమంత్ కి ఇది కొత్తేమి కాదు. చాలా మంది హీరోలు సినిమా చేస్తే చాలు అని అనుకుంటుంటే.. ఈ హీరో మాత్రం తనను వెతుక్కుంటూ వచ్చిన పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్ లని వారి కథలని తిరస్కరించడం జరిగింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: