అయ్యా రాజమౌళి ఆ అలియాభట్ అవసరమా..? మండిపడుతున్న నెటిజన్స్...!
‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ నుంచి ఆలియా వెళ్ళిపోయింది అంటూ సోమవారం మధ్యాహ్నమే కొన్ని వార్తలు వచ్చాయి. రణ్‌బీర్ కపూర్‌తో ఆలియా లాంగ్ ట్రిప్ అని కూడా పుకార్లు వినిపించాయి. అయితే ఆలియా ఎక్కడకు వెళ్లింది అనే విషయంలో స్పష్టత రాలేదు. అయితే మంగళవారానికి అసలు విషయం తెలిసింది. హైదరాబాద్‌లో మిస్ అయిన ఆలియా… రణ్‌బీర్‌తో కలసి గోవాలో కనిపించింది. ఇంతకీ ఈ ప్రేమ పావురాలు సోమవారం గోవాకు అత్యవసరంగా ఎందుకెళ్లాయో తెలుసా? ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికట.అవును ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ముంబయి జట్టుకు రణ్‌బీర్ కపూర్ సహయజమాని అన్న విషయం తెలిసిందే. సోమవారం గోవాలో జంషెడ్‌పూర్-ముంబయి సిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది.
ఆ మ్యాచ్‌ను చూడటానికే ఆలియాను రణ్‌బీర్ తీసుకెళ్లాడట. ఈ విషయంలో తెలుగు అభిమానులు రాజమౌళిపై సోషల్ మీడియాలో సీరియస్ అవుతున్నారు. అయ్యా రాజమౌళి గారు ఆ ఆలియా భట్ మనకు అవసరమా. ఇంకా ఏ హీరోయిన్లు దొరకనట్లు ఆమెనే తీసుకున్నారు. ఎందుకండీ ఆమె షూటింగులకు సరిగ్గా రాదు అనవసరంగా సమయం వృధా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఫైర్ అవుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...