బిగ్ బాస్ దివి వెంట పడుతున్న దర్శక నిర్మాతలు..!

shami
బిగ్ బాస్ షో వల్ల సూపర్ పాపులర్ అయ్యింది దివి. మోడల్ కమ్ యాక్ట్రెస్ అయిన దివి బిగ్ బాస్ కు వెళ్లకముందు కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు కాని బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత ఆమె చాలా ఫేమస్ అయ్యింది. తన అందచందాలతో ఆడియెన్స్ ను మెప్పించిన దివి బయటకు వచ్చాక సూపర్ రెస్పాన్స్ అందుకుంది. షోకి వెళ్లకముందు ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ వేలలో ఉంటే ఇప్పుడు లక్షల్లో ఉన్నారు. ఇది చాలదా బిగ్ బాస్ ఆమెకు ఏమిచ్చిందో చెప్పడానికి.

అంతేకాదు దివి తన ఫాలోవర్స్ ను అలరించేలా హాట్ ఫోటో షూట్ తో క్రేజ్ తెచ్చుకుంటుంది. బిగ్ బాస్ హౌజ్ లో దివి ఉన్నన్ని వారాలు తన సత్తా చాటింది. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం దివికి సినిమా ఛాన్సులు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ రెండు సినిమా ఆఫర్లు వచ్చినట్టు టాక్. ఈ రెండే కాదు మరో సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉందని అంటున్నారు. సినిమా హీరోయిన్ గా వెలుగు వెలగాలని అనుకుంటున్న దివికి ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

దివి కూడా ప్రస్తుతం అలాంటి అవకాశాల కోసమే ఎదురుచూస్తుంది. తప్పకుండా దివి తన పాపులారిటీ పెంచుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో ఆమె క్రేజీగా కనిపించింది. గ్లామర్ షోకి కూడా రెడీ అని చెప్పడంతో ఆమె వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారట. సో త్వరలోనే బిగ్ బాస్ దివిని సిల్వర్ స్క్రీన్ పై చూస్తామని చెప్పొచ్చు. చూస్తుంటే దివి తన ఫాం ఇదే రేంజ్ లో కొనసాగించేలా ఆఫర్లు అందుకునేలా ఉంది. ఇంతకీ దివి ఏయే సినిమాల్లో నటిస్తుంది అన్నది మాత్రం త్వరలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: