రానా 'హిరణ్యకశ్యప' కోసం ఇద్దరు దర్శకులు..!

shami
దగ్గుబాటి వారసుడు రానా గుణశేఖర్ డైరక్షన్ లో ప్లాన్ చేసిన సినిమా హిరణ్యకశ్యప. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించాలని చూస్తున్నారు. ఈ సినిమా లాస్ట్ ఇయరే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా ఎందుకో కుదరలేదు. 2021 లో ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ క్రమంలో గుణశేఖర్ తో పాటుగా ఈ సినిమాకు మాటల మాత్రికుడు త్రివిక్రం కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.

హిరణ్యకశ్యప సినిమాకు త్రివిక్రం తో ఏం సంబంధం అనుకోవచ్చు. ఈ సినిమాకు త్రివిక్రం మాటలు అందిస్తున్నాడని తెలుస్తుంది. తన మాటలతో సినిమాను నెక్స్ట్ లెవల్ లోకి తీసుకెళ్లే త్రివిక్రం ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాతో పాటుగా హిరణ్యకశ్యప సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గుణశేఖర్ తో పాటు త్రివిక్రం కూడా ఈ సినిమాకు జాయిన్ అయితే సినిమా వేరే లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

హిరణ్యకశ్యప సినిమాను సురేష్ బాబు 250 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకు ముందే శాకుంతలం అనే ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశాడు గుణశేఖర్ ఈ సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా హిరణ్యకశ్యని వేరే లెవల్ లో ప్లాన్ చేస్తున్నారని మాత్రం అర్ధమవుతుంది. రానా కూడా ప్రస్తుతం విరాటపర్వం సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ సలార్ లో కూడా రానా స్క్రీన్ షేర్ చేసుకుంటాడని తెలుస్తుంది. వరుస క్రేజీ సినిమాలతో రానా అదిరిపోయే స్కెచ్ వేశాడని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: