బిగ్ బాస్ పై పునర్నవి షాకింగ్ కామెంట్స్....
అయితే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావడం లేదనే పోలికలు చూసుకోవడం కంటే కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలనేదే తన ఆలోచనగా చెప్పింది. అంతేకాదు డ్యాన్స్ థెరపీలో మాస్టర్స్ చేయడం తన గోల్ అని కూడా చెప్పింది.బిగ్‌బాస్ వల్ల తనకు ప్రత్యేకంగా ఒరిగిందేం లేదు అని అంటోంది.‘‘బిగ్‌బాస్ వల్ల నా యాక్టింగ్ కెరీర్‌కి ఎలాంటి హెల్ప్ జరగలేదు. సోషల్ ప్రొఫైల్ పెంచుకోవడంలో ఎలాంటి ఉపయోగం జరగలేదు. అయితే చాలామంది అభిమానులకు నేను చేరువయ్యాను’’అని చెప్పింది పునర్నవి.
అయితే తాజా సీజన్లో ఇప్పటికే బయటకు వచ్చేసిన హౌస్మేట్స్ అంటే సినిమా నేపథ్యం ఉన్నవారు దివి, మోనాల్‌కి వరుస అవకాశాలు వస్తుండటం విశేషం. మరోవైపు పునర్నవి టమడా మీడియా రూపొందిస్తున్న ‘కమిట్‌మెంటల్’ వెబ్ సిరీస్‌లో చేస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...