రాధే శ్యామ్ విషయంలో తప్పుని తెలుసుకోలేకపోతున్న ప్రభాస్...
‘రాధే శ్యామ్’ చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో వుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. దీని కోసం ప్రత్యేకంగా నాలుగు సెట్లు కూడా వేశారట. ఒక్కో సెట్‌కు భారీగా ఖర్చు అయినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా వాడని అత్యాధునిక కెమెరా, లెన్స్‌లను ఉపయోగిస్తున్నారట. సినిమా క్లైమాక్స్ విభిన్నంగా తెరకెక్కిస్తుండటమే దీనికి కారణం అని చెబుతున్నారు. ‘రాధే శ్యామ్’ పీరియాడికల్ వింటేజ్ సినిమాగా రూపొందుతున్న సినిమా కాబట్టి భారీ బడ్జెట్ పెట్టడం కరెక్టే అనిపిస్తోంది. అయితే అంత బడ్జెట్ అవసరమా అనిపిస్తుంది.
సరే బాహుబలి, సాహో సినిమాలు అంటే భారీ యాక్షన్ సీన్స్ తో కూడుకున్న సినిమాలు కాబట్టి భారీ బడ్జెట్ పెట్టడం సబబే కాని రాధేశ్యాం కి అంత పెట్టాలా అని అనిపిస్తుంది. అది కూడా సాహో దెబ్బ తిన్నాక... దీన్ని బట్టి ప్రభాస్ సాహోకి చేసిన తప్పు తెలుసుకోకుండా మళ్ళీ రాధే శ్యామ్ కి అంత బడ్జెట్ పెట్టడం ఎంత వరకు కరెక్టో మరి.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....