మహేశ్‌ బాబు ప్రొడక్షన్‌లో సినిమా..!

NAGARJUNA NAKKA
మహేశ్‌బాబు ప్రొడక్షన్‌లో అడవిశేష్‌ హీరోగా మేజర్‌ రూపొందుతోంది. మెగా.. అల్లు హీరోలకు అడ్డాగా ఉన్న గీతా ఆర్ట్స్‌ అఖిల్‌తో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచురల్‌ తీస్తోంది. ఇంతకంటే విచిత్రం బాలీవుడ్‌లో చోటు చేసుకుంది. టాప్‌ హిందీ హీరోలు అక్షయ్‌కుమార్‌.. అజయ్‌దేవగణ్‌ తెలుగు సినిమాలను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. వాళ్ల కోసం కాకుండా.. బయట వాళ్లతో  ఈ రీమేక్స్ ‌తీయడం విశేషం.

అజయ్‌దేవగణ్‌ ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా రాజమౌళితో మంచి అనుబంధం వుంది. జక్కన్న తీసిన మర్యాదరామన్న హిందీ రీమేక్‌ 'సన్నాఫ్‌ సర్దార్‌' లో నటించాడు. ఆ తర్వాత ఈగ హిందీ వెర్షన్‌కు వాయిస్‌ ఇచ్చిన అజయ్‌.. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌లో ఇంపార్టెంట్ రోల్‌ పోషిస్తున్నాడు.

టాలీవుడ్‌తో అనుంబంధం పెంచుకున్న అజయ్‌ దేవగణ్‌.. ఇక్కడి హిట్‌ సినిమాలపై ఓ కన్నేశాడు. ఈ క్రమంలో శ్రీ విష్ణు, నివేథ థామస్ జంటగా నటించిన హిట్‌ మూవీ 'బ్రోచేవారెవరురా' అజయ్‌కు బాగా నచ్చి రీమేక్‌ రైట్స్‌ సొంతం చేసుకున్నాడు. దేవన్‌ మంజల్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ.. అభయ్‌ డియోల్‌ హీరోగా ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నాడు అజయ్‌.

ఇక అక్షయ్‌ అయితే.. విక్రమార్కుడు హిందీ రీమేక్‌ 'రౌడీ రాథోడ్‌'తో అదిపోయే హిట్‌ అందుకున్నాడు. 2.0 లో విలన్‌గా నటించి సౌత్‌ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు.  కాంచన హిందీ రీమేక్‌ లక్ష్మీబాంబ్‌తో ముందుకొచ్చిన అక్షయ్‌ చూపంతా సౌత్‌ పైనే. ఇక్కడి సినిమా కథలపై నమ్మకంతో.. అనుష్క నటించిన భాగమతి సినిమాను భూమి పడ్నేకర్‌తో 'దుర్గామతి'గా రీమేక్‌ చేశాడు. ఇలా ఇద్దరు స్టార్స్‌ అక్షయ్‌, అజయ్‌ తెలుగు సినిమా కథలకు నిర్మాతలుగా ఉంటూ బయట హీరోలతో నిర్మిస్తున్నారు. మొత్తానికి మహేశ్ బాబు ప్రొడక్షన్ లో అడవి శేష్ హీరోగా మేజర్ రూపొందుతోంది. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమా ఏ మాత్రం సక్సెస్ సాధిస్తుందో చూడాలి. సినీ అభిమానులు మాత్రం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: