రౌడీ పొలిటీషియన్ మారుతున్న పవన్ కళ్యాణ్.. ఎవరి కోసమో తెలుసా..??

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అలా ఎంట్రీ ఇచ్చాడో లేదో.. పవర్ స్టార్ కి వరుస అవకాశాలు  వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు దాదాపుగా వెలువడ్డాయి. ఇందులో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా ఒకటి. పవన్ కళ్యాణ్  కెరీర్ లో 29వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడైన సంగతి తెల్సిందే.పవన్ తో సురేందర్ రెడ్డి మొదటిసారి కలిసి పనిచేస్తుందా ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ అంచనాలు డబుల్ చేస్తూ… ఈ చిత్ర స్టోరీ లైన్ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.
ఈ మూవీలో పవన్ పొలిటీషియన్ గా కనిపిస్తారంటూ ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.మూవీలో పవన్ పాత్ర గతంలో ఎన్నడూ ఆయన చేయని షేడ్స్ కలిగి ఉంటుందట. ఆయన పాత్ర నెగెటివ్ యాంగిల్ కూడా కలిగి ఉంటుంది అనేది మరో ఆసక్తికర అంశం. సురేందర్ రెడ్డి మార్క్ కామెడీ యాంగిల్ మిస్ కాకుండా, బ్యాడ్ పొలిటీషియన్ గా పవన్ పాత్ర డిజైన్ చేశారని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ విస్తృతంగా ప్రచారం అవుతుంది. మరి ఇదే నిజమైతే పవన్ లోని మరో కొత్త కోణాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయనున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.
సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రం అక్కనేని యంగ్ హీరో అఖిల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత పవన్ ప్రాజెక్ట్ ని ఆయన తెరకెక్కించనున్నారు. మరో వైపు పవన్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిసినా.. దీనిపై ఇంకా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు చిత్ర బృందం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: