మరో సారి సుధీర్ టీమ్ అదరగొట్టింది.. ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్..?

praveen
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కడుపుబ్బా నవ్వించడానికి ఎంత ఒత్తిడిలో ఉన్న కాస్త ఆనందాన్ని కలిగించడానికి జబర్దస్త్ షో ఉంది అన్న విషయం తెలిసినదే. ప్రతి గురువారం జబర్దస్త్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరినీ కూడా ఎంతగానో నవ్వులు పంచుతూ ఉంటుంది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ షో పూర్తిస్థాయిలో కామెడీ పంచుతున్న తరుణంలోనే..  ఇక కామెడీ డోస్  ని మరింత పెంచి బుల్లితెర ప్రేక్షకులందరికీ మరింత ఎంటర్టైన్మెంట్ అందించాలి  అనే ఉద్దేశంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ ని కూడా ప్రారంభించారు నిర్వాహకులు.


 ఈ క్రమంలోనే కొంత మంది కమెడియన్స్ ని టీం లీడర్లను ఎక్స్ ట్రా  జబర్దస్త్ లో ఉంచగా మరికొంత మంది కమెడియన్స్ టీమ్  లీడర్లను జబర్దస్త్ లో ఉంచారు ఇలా గురు శుక్రవారాలు జబర్దస్త్ షో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ 2 షో లు కూడా ఎవరికి వారు పోటీ పడుతూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించి విడుదలైన ప్రోమో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక సాధారణంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ చేస్తుంది అంటే బుల్లితెర ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.



 ఎప్పుడూ సరికొత్త స్కిట్ తో  తెర మీదికి వచ్చే సుడిగాలి సుధీర్ టీం..  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల మరోసారి ఎక్స్ ట్రా  జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా.. ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో మరోసారి సుడిగాలి సుదీర్ సరికొత్త స్కిట్ తో  తెర మీదికి వచ్చారు. ఇక ఈ ప్రోమో లోనే సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ చూస్తుంటే పగలబడి నవ్వుతారు ప్రేక్షకులు.. ఇక పూర్తి స్థాయి ఎపిసోడ్ చూస్తే ఇక నవ్వులే నవ్వులు అనే విషయం అర్థమవుతుంది. ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: