రోజా గారు అలా చేసి.. జబర్దస్త్ కమెడియన్స్ నోట్లో మన్ను కొడుతున్నారు..?
ఇక జబర్దస్త్ ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమై ప్రస్తుతం ఒక దిగ్గజ కామెడీ షో గా కొనసాగుతుంది. ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ ను ఢీ కొట్టే షో మరో కామెడీ షో లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా ఎంతో మంది కొత్త కమెడియన్స్ కి కూడా లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. జబర్దస్త్ షో విజయవంతంగా 400 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో కాస్త బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అయితే 400 ఎపిసోడ్ లో కమెడియన్స్ అందరూ కూడా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
జబర్దస్త్ ప్రోమో లో భాగంగా ఎప్పటిలాగానే కమెడియన్స్ అందరూ కూడా సరికొత్త స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే.. వెంకీ మంకీస్ టీం చేసిన స్కిట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది ఈ క్రమంలోనే జబర్దస్త్ లోని జడ్జీలు సహా యాంకర్ అనసూయ తో కలిపి ఒక పేరడీ పాటను సిద్ధం చేశారు వెంకీ. అందరినీ పొగుడుతూ పొగుడుతూ... రోజా దగ్గరికి వచ్చారు. మాట నిలుపుకుంటివమ్మా రోజమ్మ.. జబర్దస్త్ ను వీడ లేదమ్మా అంటూ పాట పాడతాడు వెంకీ. నువ్వు 10 మార్కులు ఇస్తే స్కిట్టు విన్ను.. లేకుంటే కమెడియన్స్ నోట్లో మన్ను అంటూ పాట కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.