రామ్ 'రెడ్' సంక్రాంతికి డౌటేనా..?
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి సీజన్ లో కూడా మిస్ చేస్తారని తెలుస్తుంది. పొంగల్ రేసులో ఉండే సినిమాల హడావిడి మొదలైంది. ప్రస్తుతానికి మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమా 2021 పొంగల్ రిలీజ్ అని తెలుస్తుంది. ఇక రానా అరణ్య కూడా సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండితో పాటుగ్తా రామ్ రెడ్ వస్తుందా రాదా అన్న క్లారిటీ రాలేదు.
ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ రెడ్ సినిమాపై కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి రెడ్ సినిమా రిలీజ్ కరెక్ట్ టైం కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. రెడ్ పొంగల్ రేసులో ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఆల్రెడీ కిశోర్ తిరుమలతో రామ్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశాడు. హ్యాట్రిక్ మూవీగా రెడ్ వస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమాలో రామ్ ఫ్యాన్స్ కు డబుల్ క్యారక్టర్ లో డబుల్ ట్రీట్ ఇస్తాడని తెలుస్తుంది.