మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో గ్రౌండ్ లెవల్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దేవాలయాల్లోని కుంభకోణాలు నేపథ్యంలో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా గా పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు శివ ఈ సినిమాను ఎంతో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా అలరించనున్నట్లు టాక్. ఇప్పటికే 60 శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతున్న ట్లు తెలుస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు తిరు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ రీండోవారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు మూవీ యూనిట్. లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా మరొక రెండు నెలల ముందు జరగనుందని అంటున్నారు.
అయితే దానికి కారణం ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా అంటున్నారు. నిజానికి ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ క కానుకగా ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ అవుతుందని అయితే ఆ సమయానికి ఆచార్య రిలీజ్ అనుకున్నప్పటికీ మధ్యలో సినిమాకు సంబంధించి మరికొంత వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో ఆచార్యని కొన్నాళ్లు వాయిదా వేద్దామని అనుకుంటున్నారట మెగాస్టార్. దీనిని బట్టి చూసుకుంటే ఒకరకంగా మేనల్లుడు అల్లు అర్జున్ కోసం మెగాస్టార్ ఆచార్య ముందుకు జరిగిందని ఆ విధంగా మెగాస్టార్ ఒకింత త్యాగం చేసినట్లే అనే వార్త ప్రచారం అవుతోంది మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి అంటే దీనిపై ఆచార్య మూవీ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి.....!!