షాకింగ్ 150 కోట్ల హీరోగా నాని !

Seetha Sailaja
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్ననాని ఈమధ్య నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఓకే చేశాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ చిత్రీకరణలో ఉండగానే ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాను  లైన్ లో పెట్టి  ఆ తర్వాత చేయబోయే ‘అంటే సుందరానికి’ మూవీని కూడ లైన్ క్లియర్ చేసాడు.   దీనితో ‘వీ’ ఫ్లాప్ అయినా నాని రేంజ్ ఏమాత్రం తగ్గ లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి.

దీనికితోడు నాని మూవీ  సెట్స్ కి వెళ్లకముందే డీల్స్ ఫైనల్ అవ్వడం చూస్తున్న వారు మరింత ఆశ్చర్యపోతున్నారు. వచ్చే సమ్మర్ రేస్ కు రాబోతున్న ‘టక్ జగదీష్’ మూవీని 47 కోట్లకు విక్రయించారు అన్న వార్తలు షాకింగ్ గా మారాయి. అంతేకాదు ఈ నెలలో ప్రారంభం కాబోతున్న ‘శ్యామ్ సింఘరాయ్ మూవీకి కూడ ఈ మూవీ షూటింగ్ కు ప్రారంభం కాకుండానే భారీ ఆఫర్లు వస్తున్నట్లు టాక్.

ఈమూవీ తరువాత నాని నటించబోయే వివేక్ ఆత్రేయ మూవీ ‘అంటే సుందరానికి’ ని జీ 5 వాళ్లు 52కోట్లకు ఎ టు జడ్ హక్కులను కొనుక్కున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలా నాని నటిస్తున్న మూడు  సినిమాల బిజినెస్ 150 కోట్ల రేంజ్ కి దాటి పోవడంతో ఈ కరోనా పరిస్థితులలో కూడ నాని సినిమాలకు ఇంత మార్కెట్ ఉందా అన్న ఆశ్చర్యం కలుగుతోంది.

అంతేకాదు వచ్చే ఏడాది నాని వైపు నుండి ఈ మూడు సినిమాలు వరసగా రిలీజ్ కాబోతున్నాయి. టాప్ హీరోలు అంతా సంవత్సరానికి ఒక్క సినిమా చేయడం కష్టంగా ఉన్న పరిస్థితులలో నాని ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ మరో మూడు సినిమాలను లైన్ లో పెడుతున్న అతని స్ట్రాటజీకి టాప్ హీరోలు కూడ షాక్ అవుతున్నట్లు టాక్. టాప్ హీరోలు తమ సినిమాలకు సంబంధించి 25 కోట్ల నుండి 30 కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉంటే నాని టాప్ హీరో కాకుండానే ప్రతి సంవత్సరం టాప్ హీరోల స్థాయిలో సంపాదన పెంచుకుంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: