సుధీర్ - రష్మీ మెగాస్టార్ సాంగ్.. ఓల్డ్ గెటప్.. అదిరిపోయింది అంతే..?
అయితే ఈ ఇద్దరు కలిసి ఒక స్టేజ్ పై కనిపించి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు అంటే ఇక ఆ షో టాప్ రేటింగ్ సొంతం చేసుకోవడం ఖాయం అన్న విధంగా ఉంది ఈ జంట క్రేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో. అయితే వీరిద్దరూ మాట్లాడే మాటలు కూడా ప్రస్తుతం ఎంతో మంది యువతను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ టీవీ యాజమాన్యం ఇటీవలే కొత్త సంవత్సరం రోజున డీజే అనే కొత్త ఈవెంట్ ను లాంఛ్ చేశారు. ఇక ఈ సరికొత్త ఈవెంట్ లో బుల్లితెర మోస్ట్ వాంటెడ్ జోడి సుధీర్ రష్మీ తో కలిసి ఒక సాంగ్ ప్లాన్ చేశారు.
ఇటీవలే విడుదలైన డీజే ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ ప్రోమో లో మొదట సుడిగాలి సుదీర్ యాంకర్ రష్మీ ఇద్దరు కలిసి మెగాస్టార్ పాట అయిన నవ్వింది మల్లెచెండు అనే పాటకు డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదర గొట్టారు. అయితే ఈ పర్ఫామెన్స్ సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మీ కూడా ఓల్డ్ గెటప్ లో కనిపించి డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టడంతో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరూ ఈ పర్ఫామెన్స్ చూసి మురిసిపోతున్నారు అని చెప్పాలి. అచ్చంగాచిరంజీవి అసలు పాట ఉన్నట్లుగానే డాన్స్ స్టెప్పులు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు ఈ జంట మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.