కెజిఎఫ్ డైరెక్టర్ సాధారణ వ్యక్తికాదు..!

NAGARJUNA NAKKA
కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాములోడు కాదు. ఎంటైర్ సినీ ఇండస్ట్రీని అటెన్షన్ లోకి తీసుకున్నాడు. ఇప్పటికే మూడుసార్లు ఏదో చెబుతానని ఇంకేదో చూపిన ఈ కన్నడ దర్శకుడు.. ఇప్పుడు మాత్రం కశ్చితంగా  అదిరిపోయే ట్రీట్ తో అందరినీ సర్ ప్రైజ్  చేస్తానంటున్నాడు. ఈ సారి డిజప్పాయింట్ చేసే ప్రసక్తే లేదంటున్నాడు.

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్... గత కొంతకాలంగా ట్రెండ్ లో నిలుస్తూనే ఉన్నాడు. చేతిలో కెజిఎఫ్ 2 ఫిలింను పెట్టుకొని  సోషల్ మీడియాలో నెక్స్ట్ ప్రాజెక్ట్ న్యూస్ తో అదరగొట్టిన ఈయన గారు.. ఈ సారి సర్ ప్రైజ్ అప్ డేట్ ఇస్తానంటూ చెప్పి నాసి రకం అప్ డేట్స్ తో టైమ్ కిల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో.. ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు.

కేజిఎఫ్-2  విలన్ అధీరా పాత్రదారి సంజయ్ దత్ ప్రస్తుతం ఆర్.ఎఫ్.సి.లో యాక్షన్ పార్ట్ షూట్ లో ఉన్నాడు. గత కొన్ని రోజులుగా అతి పెద్ద క్రూతో ప్రశాంత్ నీల్  ఈ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నాడు. దానిలో భాగంగా క్లయిమాక్స్ షూట్ పూర్తి చేశాడు. మరి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రకారంచూస్తే... సోమవారం ఉదయం 10గంటల 8నిమిషాలకు  ఇస్తానన్న అప్ డేట్ దీనికి సంబందించిన న్యూసే అయ్యుండొచ్చు. లేదు అంటే క్రిస్ట్ మస్ కానుకగా ఫస్ట్ గ్లింప్స్ ఏమైనా రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అదిరిపోయే సర్ఫైజ్.. కశ్చితంగా టీజరే అయ్యుంటుందని కన్నడ పరిశ్రమలో హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ టీజర్ లో సంజయ్ దత్ మూమెంట్స్ చూపించి.. నేషనల్ వైడ్ సినిమాను మరోసారి ట్రెండ్ లో పెట్టాలని మేకర్స్  డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తుంది. పనిలో పనిగా యాష్ ను మరోసారి లైమ్ లైట్లోకి తెచ్చి సౌత్ ఆడియన్స్ కు క్రిస్ట్ మస్ ట్రీట్ ఇవ్వాలనేది అటు దర్శకుడి ఉద్దేశ్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: