మెగా సీక్రెట్స్ అన్ని లాగేసిన సమంత..!
ఆహా ఓటిటిలో సమంత హోస్ట్ గా చేస్తున్న సామ్ జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ గా ఆహా ఫాలోవర్స్ అందరిని మెగా చిట్ చాట్ సర్ ప్రైజ్ చేయనుంది. అయితే దీనికి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. మెగా సీక్రెట్స్ అన్ని రాబట్టడంలో సమంత సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మెగాస్టార్ రొమాంటిక్ కాదా.. చిరు దోశ స్పెషల్ ఏంటి.. దోశ ఫ్లిప్ ఎలా చేస్తారు.. కళ్లకు గంతలు కట్టుకుని కూడా మెగాస్టార్ దోసని ఫ్లిప్ చేస్తారా ఇలాంటివన్ని ఇంటర్వ్యూలో చూపిస్తున్నారు.
అంతేకాదు మెగాస్టార్ ఫ్రిజ్ లో ఏముంటుందని అడిగితే అదే అన్నారు.. అయితే అదంటే మీరనుకుంటుంది కాదంటూ మాట మార్చేశారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఎపిసోడ్ మెగా ఫ్యాన్స్ కు సూపర్ ఎంటర్టైన్ అందించేలా ఉంది. తప్పకుండా ఈ ఎపిసోడ్ కు మంచి వ్యూస్ రావడం పక్కా అని చెప్పొచ్చు. అంతేకాదు సమంత మెగాస్టార్ కు సంబందించిన ఇంకా ఎన్నో సీక్రెట్స్ ను ఆడియెన్స్ కు రివీల్ చేసే ప్రయత్నం చేసిందని తెలుస్తుంది. మొత్తానికి ఈ షో మెగా ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.