మెగా హీరో తో కెమిస్ట్రీ బాగుందన్న ఇస్మార్ట్ బ్యూటీ....!?
ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ల ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది.ఏ మాటకు ఆ మాట నభా నటేశ్ కు ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది..
ఈ నెల 25న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది నభా. కరోనా మహమ్మారి అందరినీ ఇబ్బందులకు గురి చేసిందని...వైరస్ వల్ల జీవితాలు స్తంభించిపోయాయని నభా అన్నారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని...థియేటర్లలో సినిమా విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. హీరో సాయిధరమ్ తేజ్ తో కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని...సాయి తేజ్ ఫ్రెండ్లీగా, తోటి నటులకు సపోర్టివ్ గా ఉంటారని వెల్లడించారు.
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్’లో నభా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. అలాగే నితిన్‌తో ‘అందాదున్’ రీమేక్‌లో నభా నటిస్తోంది.