రోజాని అమ్మ అనేసిన జబర్దస్త్ కమెడియన్.. కారణం ఏంటంటే..!

shami
జబర్దస్త్ షోలో యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు రోజా. నాగబాబు బయటకు వెళ్లినా ఆమె మాత్రం ఒంటి చేత్తో షోని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నాగబాబు ఎగ్జిట్ అవడం ఆ తర్వాత రోజాకి కాంబినేషన్ లో ఎవరు సెట్ అవుతారని చాలామందిని చూశారు. ఫైనల్ గా సింగర్ మనోని ఫిక్స్ చేశారు. ఆయనకు జబర్దస్త్ నీళ్లు బాగా పడినట్టు అనిపిస్తుంది.

ఇదిలాఉంటే నాగబాబు బయటకు వెళ్లాక జబర్దస్త్ మీద రోజా అప్పర్ హ్యాండ్ సాధించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో రోజా కమెడియన్స్ వేస్తున్న స్కిట్స్ కు సంబందించి ముందే పంచ్ డైలాగ్స్ రివీల్ చేస్తుంది. అంతేకాదు కొత్త వారిని కూడా ఎంకరేజ్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ఈమధ్యనే బాగా క్లిక్ అయిన ఇమ్మాన్యుయెల్ ను బాగా ఎంకరేజ్ చేస్తుంది రోజా. చూడటానికి అతను నల్లగా ఉన్నా చాక్లెట్ బోయ్ అనే బిరుదు కూడా ఇచ్చింది రోజా.

అయితే ఇమ్మాన్యుఎల్ సక్సెస్ లో రోజా పాత్ర కూడా చాలా ఉందని అనిపిస్తుంది. రీసెంట్ గా ఇమ్మాన్యుయెల్ తన ఫాలోవర్స్ చిట్ చాట్ లో భాగంగా రోజా గారే తనని ఎంకరేజ్ చేశారని.. అందుకే ఆమె తనకు అమ్మతో సమానమని అన్నాడు. అంతేకాదు రోజమ్మే తనకు చాక్లెట్ బోయ్ అనే పేరు పెట్టిందని. వర్షతో కెమిస్ట్రీ కూడా ఆమె వల్లే అలా కుదిరిందని అన్నారు. రోజా ని రోజమ్మ అని ఇమ్మాన్యుయెల్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈమధ్య కాలంలో అందరు కమెడియన్స్ జబర్దస్త్ స్కిట్స్ లో ఇమ్మాన్యుయెల్ ను బాగా వాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: