గోపీచంద్ తో "పక్కా కమర్షియల్" సినిమా తెరకెక్కిస్తున్న మారుతి....
యూవీ, గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నారు. సినిమాలో గోపి చంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఫీజు కోసం ఎలాంటి కేసునైనా వాదించే క్యారెక్టర్ అది. ప్రతీ విషయంలో కమర్షియల్ గా ఆలోచించే ఆ లాయర్ పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుందట.ఈ పాయింట్ ని బట్టి సినిమాకి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పెట్టాలని మారుతి భావిస్తున్నాడట. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం గోపీచంద్.. మారుతి సినిమా కోసం డేట్స్ కేటాయించాల్సివుంది. అవి సర్దుబాటు అయితే త్వరలోనే ఈ కాంబినేషన్ గురించి అధికార ప్రకటన వెల్లడించబోతున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....