ఇండ్రస్టీ కి రాకముందు డైరెక్టర్ మారుతి ఏ పని చేసేవాడో మీకు తెలుసా..??
ఆయన స్ఫూర్తితోనే అడుగులు వేశాను.మొదట్లో చిన్న సినిమాలనే చేశాను. ఫస్ట్ సినిమాగా బస్‌స్టాప్ తీశాను. తర్వాత ఈ రోజుల్లో.. కొత్తజంట, ప్రేమకథా చిత్రమ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, బాబు బంగారం, భలేభలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే...తదితర చిత్రాలు చేశాను. దాదాపుగా అన్ని చిత్రాలు సక్సెస్ అయ్యాయి. భలేభలే మగాడివోయ్, ప్రేమకథా చిత్రమ్ సినిమాలు కమర్షియల్‌గా భారీ కలెక్షన్లు తెచ్చాయి.నేను తీయబోయే సినిమా కథ.. ఫస్ట్ నాలో ఉన్న ఆడియన్‌ను సంతృప్తి పరిస్తేనే సినిమా తీస్తాను. నేను తీసిన ఒక్కో సినిమా ద్వారా నేను కూడా ఎదుగుతున్నాననే భావన నాలో కలగాలనేలా సినిమా చేస్తాను. మంచి కిక్ ఇచ్చే సబ్జెక్టుల కోసం ట్రై చేస్తుంటాను.
అందుకే సినిమా సినిమాకు వైవిధ్యం కనిపించేలా జాగ్రత్త తీసుకుంటాను. ప్రేమ కథా చిత్రమ్‌తో హర్రర్ కామెడీ.. తాతామనమడు అనుబంధంతో ప్రతి రోజూ పండుగే.. మతిమరుపు లవ్‌స్టోరీగా భలేభలేమగాడివోయ్.. కామెడీ యూత్ లవ్ స్టోరీలుగా ఈరోజుల్లో, బస్‌స్టాప్.. కామెడీ పోలీస్‌గా బాబు బంగారం తదితర సినిమాలు తీశాను. ప్రేక్షక దేవుళ్లకు 'మారుతి' సినిమా అంటే గుర్తుపట్టే స్థాయికి చేరడం నిజంగా సంతృప్తిగా ఉంది.భలేభలేమగాడివోయ్, ప్రతిరోజూ పండుగే... చిత్రాలను హిందీలో రీమేక్ చేయడానికి అడుగుతున్నారు. నటీనటులను ఎంపిక చేసి త్వరలోనే బాలీవుడ్ లో కూడా ఈ ప్రాజెక్టులను నేనే డైరక్ట్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు మారుతి...!!