డబ్బుల్లో మునిగితేలుతున్న బ్యూటీలు..!
తెలుగు, తమిళ్ సినిమాలతో ఇంప్రెస్ చేస్తోన్న రాశీఖన్నా ఇప్పుడు ఒక వెబ్‌సీరీస్‌కి సైన్ చేసింది. దర్శక ద్వయం రాజ్, డికె డైరెక్షన్లో షాహిద్ కపూర్‌తో కలిసి వెబ్ సీరీస్ చేయబోతోంది. షాహిద్ కపూర్‌తో సీరీస్ చేస్తే, నార్త్‌లో ఫేమ్ వస్తుందని, ఈ పాపులారిటీతో బాలీవుడ్లో బిజీ కావొచ్చని ఆశపడుతోందట రాశీ ఖన్నా.
కాజల్ అగర్వాల్ రెండు పడవల ప్రయాణం చేస్తోంది. ఒక వైపు సినిమాలు మరోవైపు వెబ్ సీరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత యంగ్‌స్టర్స్ నుంచి ఆఫర్స్ తగ్గినా, సీనియర్ల సినిమాలతో బండి లాగిస్తోంది. కమల్ హాసన్‌తో 'ఇండియన్2', చిరంజీవితో 'ఆచార్య' చేస్తోంది కాజల్. ఈ సినిమాలతోపాటు రెండు వెబ్ సీరీసులకి కూడా సైన్ చేసింది చందమామ. 'లైవ్ టెలికాస్ట్' అనే హారర్ సీరీస్‌తో పాటు, 'క్వాంటికో' రీమేక్‌కి ఓకే చెప్పిందట కాజల్.
సమంత పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలు తగ్గించింది. స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌కే సైన్ చేస్తోంది. కానీ సినిమాల్లో పెద్దగా ఛాలెంజింగ్ రోల్స్ రావడం లేదు. దీంతో కొత్త కొత్త ప్లాట్‌ఫామ్స్ వెతుక్కుంటోంది సమంత. ఈ ఇదిలోనే వెబ్ సీరీసులు చేస్తోంది. హిందీలో 'ది ఫ్యామిలీమెన్2' అనే వెబ్ సీరీస్‌లో విలన్‌గా నటించింది సామ్.
తమన్నాకి ఇప్పుడు భారీ సినిమాలు రావడం లేదు. స్టార్ హీరోలు మిల్కీని రిపీట్ చేయడం లేదు. పైగా తమన్న కూడా కొంచెం యూనిక్‌గా ఉండే క్యారెక్టర్స్ చేయాలనుకుంటోంది. ఈ లెక్కలతోనే నితిన్ 'అంధాదున్' రీమేక్‌లో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. అలాగే 'ది నవంబర్ స్టోరీస్, లెవంత్ అవర్' అనే సీరీస్‌లకి ఓకే చెప్పింది తమన్నా.