ఒకే హీరో.. నెల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్..?

shami
యువ హీరో నితిన్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇయర్ మొదట్లోనే భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న రంగ్ దే సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో చెక్ సినిమా చేస్తున్నాడు నితిన్. రంగ్ దే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత చెక్ సినిమాను కూడా స్పీడప్ చేశాడు నితిన్. తెలుస్తున్న సమాచారం ప్రకారం నితిన్ రంగ్ దే, చెక్ రెండు సినిమాలు కేవలం ఒక నెల గ్యాప్ తోనే రిలీజ్ అవుతాయని టాక్. రంగ్ దే సంక్రాంతి బరిలో ఉండాల్సింది కాని పోటీ ఎక్కువగా ఉందని రేసు నుండి తప్పుకుంది. అయితే ఫిబ్రవరిలో నితిన్ రంగ్ దే రిలీజ్ ఉంటుందని అంటున్నారు.
ఇక చెక్ సినిమాను కూడా మార్చి ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అంటే ఫిబ్రవరి రంగ్ దే వస్తే.. మార్చి, ఏప్రిల్ లో చెక్ వస్తుంది. అంటే నెల రోజులు మాత్రమే గ్యాప్ అన్నమాట. అంతేకాదు చెక్ సినిమాతో నితిన్ మరోసారి యాక్షన్ ట్రయిల్ వేస్తున్నాడు. అది సక్సెస్ అయితే నితిన్ కూడా ఇక రొమాంటిక్ తో పాటుగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలను ఎంచుకుంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: