సుడిగాలి సుధీర్ షాక్ ఇచ్చిన జనం..!?

N.ANJI
బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షుకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. ఇక ప్రస్తుతం బుల్లితెరపై ఈయన కంటే తోపులు అయితే ఎవరూ లేరు. నెలలో 30 రోజులు బిజీగానే ఉంటాడు సుధీర్. జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరికొన్ని షోలు కూడా చేసుకుంటూ బిజీ అయిపోయాడు. మధ్యలో వెండితెరపై కూడా తన లక్ పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు పూర్తి చేసాడు. 

సుడిగాలి సుధీర్ కు జనాలు ఊహించని షాక్ ఇచ్చారు. కామెడీతో డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సుడిగాలి సుధీర్ ఈ మధ్య హీరోగా మారి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  సుధీర్ కు సంబంచిన ఓ సినిమా షూటింగ్ ను ప్రజలు అడ్డుకున్నారు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమాలో సుధీర్ హీరోగా నటించాడు. తాజాగా అదే ఆ సినిమాను డైరెక్ట్ చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల తో సుధీర్ మరో సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లోని మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

అయితే షూటింగ్ మొదలవగానే అక్కడికి చేసుకున్న స్థానికులు చిత్రీకరణను అడ్డుకున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇళ్లమధ్య షూటింగ్ చేయడం పై జనాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే అక్కడినుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జనాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. షూటింగ్ కు పర్మిషన్ ఉందని స్థానికులకు నచ్చజెప్పారు పోలీసులు దీంతో పరిస్థితి సద్దుమణిగినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: