సుడిగాలి సుధీర్ కొత్త సినిమా షూటింగ్ ని అడ్డుకున్న జనం..షాక్ లో సుధీర్.. అసలు ఏం జరిగిందంటే..??
అయితే ప్రస్తుతం సుధీర్ హీరోగా సరికొత్త అవతారంలో ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నారు. అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో సుధీర్ హీరోగా నటిస్తున్నారు. హారర్ అండ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాలింగ్ సహస్త్ర అనే మూవీలో నటిస్తున్నారు. అజయ్ శ్రీవాస్తవ అనే పాత్రలో సుధీర్ కనిపించనున్నాడు. ఇందుకోసం సుధీర్ చాలా వర్కౌట్లు చేశాడు. ఇందుకోసం సుధీర్ తన లుక్ కూడా మార్చారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో బీ బ్లాక్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సుధీర్ తన మూవీ షూటింగ్లో పాల్గొన్నారు.
స్థానికులు షూటింగ్ ప్రదేశానికి చేరుకుని దానిని అడ్డుకున్నారు. కరోనా ఉద్ధృతి నేపధ్యంలో నివాసాల మధ్య షూటింగ్లు నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సినిమా షూటింగ్ చేసేందుకు పర్మిషన్ ఉందని పోలీసులు వారికి వివరించారు..అయినా కూడా జనాలు మాట వినకుండా షూటింగ్ నిలిపివేశారు...ఇక పోలీసుల రాకతో ఆ గొడవ కొద్దిసేపటి తర్వాత సర్దు మణిగినట్లు తెలుస్తోంది...ఇక ప్రస్తుతం సుధీర్ మాత్రం ఇటు వెండి తెరపై హీరోగా, అటు బుల్లితెరపై జబర్దస్త్, ఢీ, లతో పాటు మరికొన్ని స్పెషల్ ఈవెంట్స్ లో తన దైన కామెడీ, స్టైల్, పెర్ఫార్మన్స్ లతో అదరగొడుతున్నాడనే చెప్పాలి...!!