ఆర్ నారాయణ మూర్తి: దయచేసి సినిమా టిక్కెట్ల రేట్లను పెంచొద్దు..?
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఆర్ నారాయణ మూర్తి పరోక్షంగా కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ నటన అద్భుతం అంటూ.... అభిమానులు మురిసిపోతున్నారు. ఈ ఆనంద సమయంలో థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. థాంక్స్ మీట్ కు విచ్చేసిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ... ఈ సినిమా సందిగ్ధంలో ఉన్న థియేటర్స్ తెరుచుకోవడానికి భరోసా ఇచ్చింది. మళ్లీ సినిమాలు తిరిగి థియేటర్లో రిలీజ్ కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు.
కానీ కరోనా కష్ట సమయంలో సినీ పరిశ్రమ కష్టాలు పడుతోంది. ఇటు ప్రేక్షకులు సైతం కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో ఒకరికొకరు సహాయపడాలి... ప్రేక్షకులు ఇబ్బంది పడే విధంగా పెద్ద సినిమాల వారు టికెట్ల రేట్లు పెంచకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిగా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ విధంగా టికెట్ల రేట్లను పెంచొద్దు అని మీడియా ముఖంగా తెలియచేయడంతో డిస్ట్రిబ్యూటర్లు మరియు థియేటర్ యాజమాన్యం ఏవిధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.