రాధే శ్యామ్ రిలీజ్ అప్పుడేనా..?
సినిమా రిలీజ్ ఎప్పుడా అన్న కన్ ఫ్యూజన్ కు తెర దించుతూ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా 2021 ఏప్రిల్ 30న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనున్నాడు. ఈమధ్యనే రిలీజైన పోస్టర్స్ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఇక సినిమాలో పూజా హెగ్దే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చినా ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. అందుకే రాధే శ్యామ్ సినిమాలో ఆ కాలిక్యులేషన్స్ మిస్ కాకుండా సౌత్, నార్త్ ఆడియెన్స్ అందరిని మెప్పించేలా సినిమా వస్తుందట. సినిమా మీద ప్రభాస్ పూర్తి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి రాధే శ్యామ్ రాబోయే సమ్మర్ లో సత్తా చాటబోతుందని తెలుస్తుంది.