డ్యాన్సర్స్ వర్సెస్ కమెడియన్స్.. డిజే న్యూ ఇయర్ ఈవెంట్..!

shami
ఈటివి టి.ఆర్.పికి వెన్నుదన్నుగా నిలిచిన రెండు షోలు ఏవి అంటే ఒకటి జబర్దస్త్ రెండోది ఢీ. డ్యాన్స్ షో ఒకటైతే.. కామెడీ షో మరొకటి. ఈ రెండు షోలతో ఏళ్ల తరబడి ఈటివి ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. అయితే డ్యాన్స్ షో ఎక్కువా.. కామెడీ షో ఎక్కువా అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. అయితే ప్రేక్షకుల్లో ఆ తేడా రాలేదు కాని వారి మధ్య మాత్రం తేడా వచ్చేసింది. డ్యాన్సర్స్ వర్సెస్ కమెడియన్స్ డిజే అంటూ ఓ స్పెషల్ షో రాబోతుంది.

న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ షోని క్రేజీగా ప్లాన్ చేశారు. డ్యాన్సర్స్ తో పోటీ పడి మరి జబర్దస్త్ కమెడియన్స్ డ్యాన్సులు చేశారు. అంతేనా ఫైనల్ షూట్ అవుట్ రౌండ్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. నిజంగానే డ్యాన్సర్స్ కు ఈక్వల్ గా కమెడియన్స్ డ్యాన్స్ చేసినట్టుగా ఈ షో ప్రోమో చూస్తే తెలుస్తుంది. చూస్తుంటే న్యూ ఇయర్ కు గ్రాండ్ వెల్కం చెప్పేందుకు ఈటివి ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ ఇస్తున్నారు జబర్దస్త్, ఢీ టీం మెంబర్స్.

అయితే కామెడీనే కాదు మేము డ్యాన్స్ కూడా చేయగలమని ప్రూవ్ చేసుకుంటున్నారు. చూస్తుంటే ఢీ వర్సెస్ జబర్దస్త్ అదే డీజే షో న్యూ ఇయర్ ఈవెంట్ లలో స్పెషల్ గా కానుంది. మరి ఈ షో ఎలా మెప్పిస్తుంది అన్నది రేపు షో చూస్తే అర్ధమవుతుంది. పండుగ ఏదైనా వచ్చింది అంటే జబర్దస్త్ టీం తో స్పెషల్ షో ప్లాన్ చేసే ఈటివి టీం.. ఈసారి డ్యాన్సర్స్ ని కూడా ఈ షోలో ఇన్వాల్వ్ చేసింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: