రౌడీ పాత్రలకి సై అంటున్న హాట్ బ్యూటీ...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... తనుశ్రీ దత్త అప్పట్లో సినిమాల్లో హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కింది.తరువాత చాలా కాలం సినిమాలకు దూరమై తరువాత ఆ మధ్య  ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.తెలుగులో కూడా సినిమాలు చేసింది.బాలకృష్ణతో కలిసి ‘వీరభద్ర’ అనే సినిమా చేసింది తనుశ్రీ. ఆ సినిమా సమయంలో బాలయ్యతో పాటు చిత్రయూనిట్ మొత్తం తనను బాగా చూసుకుందని.. ఆ సమయంలో ఎన్నో రకాల వంటకాలు ట్రై చేసినట్లు చెప్పుకొచ్చింది.

షూటింగ్ పూర్తయ్యే సరికి 5 కిలోల బరువు పెరిగానని తెలిపింది. పెరిగిన బరువును తల్లితండ్రులకు చూపిస్తూ.. టాలీవుడ్ లో ప్రేమ ఈ రేంజ్ లో ఉంటుందని చెప్పిందట. ఇలా టాలీవుడ్ ని, తెలుగు హీరోలని తెగ కాకాపడుతుంది ఈ బ్యూటీ. ఎంత పొగిడినా.. అమ్మడుకి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరనిపిస్తుంది. కాస్టింగ్ కౌచ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీని కెలికేసిన ఈ భామకి తెలుగులో అవకాశాలు వస్తాయని ఆశించడం భ్రమే. తనుశ్రీ దత్తా ఇప్పుడు బెంగాలీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ పై దృష్టి పెడుతోంది. కంటెంట్ పరంగా బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా ఎత్తులో ఉందంటోంది ఈ బ్యూటీ.

తనకు స్టార్ డమ్ వచ్చింది తెలుగు సినిమాలతోనే అని ప్రకటించుకుంది. మంచి రోల్స్ వస్తే టాలీవుడ్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది.కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కంటెంట్ బాగుంటే విలన్, వదిన పాత్రలు చేయడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: