హమ్మయ్య పవర్ స్టార్ పూర్తి చేశాడోచ్..!

shami
అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. ఇక దాదాపు సినిమాలు చేయరన్న టాక్ కూడా వచ్చింది. అయితే అభిమానుల కోరిక మేరకు మళ్లీ తిరిగి సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారు సినిమాలు వరుసగా లైన్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్. అందులో మొదటిది వకీల్ సాబ్. నాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వకీల్ సాబ్ మూవీ చేశాడు పవర్ స్టార్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నివేదా థామస్, అంజలి వటి స్టార్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారని తెలుస్తుంది. పవన్ ఇచ్చిన డేట్స్ లోనే షూటింగ్ చేయడం.. మధ్య కరోనా లాక్ డౌన్.. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలవడం.. ఫైనల్ గా షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ వెళ్లడించారు.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ అంతా సరదాగా ఫోటోలు కూడా దిగారు. పవన్ సినిమా అనుకున్న టైం కు పూర్తి చేశారనే చెప్పొచ్చు. ఇక 2021 సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఈ సినిమాను సమ్మర్ కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 9న పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. మరి అజ్ఞాతవాసి కమర్షియల్ గా నిరాశపరచింది కాబట్టి వకీల్ సాబ్ తో బాక్సాఫీస్ పై తన స్టామినా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: