హిట్ సినిమాలను రిజెక్ట్ చేసిన హీరో.. దరిద్రం అంటే ఇదేనేమో!
అంకుశం సినిమాలో హీరో రాజశేఖర్ నటించిన పోలీసు పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రజల మదిలో మెదులుతూనే ఉంటుంది. హీరో రాజశేఖర్ నటించిన ప్రతిఘటన, తలంబ్రాలు, ఆహుతి ,అల్లరి ప్రియుడు, ఆయుధం వంటి సినిమాలు హీరో రాజశేఖర్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి .ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమా గరుడవేగ విజయం సాధించి మంచి కలెక్షన్లను రాబట్టింది. తర్వాత విడుదలైన "కల్కి "మూవీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేకపోయింది.
హీరో రాజశేఖర్ తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో విలక్షణమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అప్పటికీ, కొన్ని హిట్ మూవీస్ వదులుకున్నాడు. ఆ మూవీస్ ఇప్పుడు చూద్దాం.
హీరో వెంకటేష్ కు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా చంటి. ఈ సినిమాకు మొదట హీరో రాజశేఖర్ అని అనుకున్నారు కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వదులుకున్నాడు.
జెంటిల్మెన్ దర్శకుడు శంకర్ నిర్మించిన ఈ సినిమాకు మొదట హీరో రాజశేఖర్ ను సంప్రదించరు, తన బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు. తర్వాత అర్జున్ హీరోగా చిత్రాన్ని నిర్మించారు.
చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా కూడా మొదట హీరో రాజశేఖర్ గారి అనుకున్నారు కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా చేయలేకపోయారు. ఠాగూర్ సినిమా కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.
"సామి" రీమేక్ చిత్రంగా వచ్చిన లక్ష్మీ నరసింహ చిత్రాన్ని కూడా హీరో రాజశేఖర్ వదులుకున్నాడు.
హనుమాన్ జంక్షన్ మొదట ఈ సినిమాను మోహన్ బాబు రాజశేఖర్ కాంబినేషన్లో నిర్మించాలనుకున్నారు ఇద్దరి బిజీ షెడ్యూల్ వల్ల ఈ చిత్రాన్ని కూడా హీరో రాజశేఖర్ పడుకున్నాడు.
తేజ దర్శకత్వంలో వచ్చిన "నేనే రాజు నేనే మంత్రి" సినిమా కథను మొదట రాజశేఖర్ గారికి వినిపించారట, అయితే కొన్ని కారణాల వల్ల హీరో రాణా తో ఈ సినిమాను నిర్మించడంతో తెలుగు సినీ పరిశ్రమలో రాణాకు మంచి గుర్తింపు లభించింది.
హీరో రాజశేఖర్ గారు సినీ ప్రయాణంలో కొన్ని బ్లాక్ మాస్టర్ మూవీస్ వదులుకున్నాడు అని చెప్పవచ్చు.