మోనాల్ కు ఆఫర్లే ఆఫర్లు..!

NAGARJUNA NAKKA
బిగ్‌బాస్‌ సీజన్‌ 4ను గ్లామర్‌తో నింపేసిన మోనాల్‌ గజ్జర్‌  వెండితెరపై భారీగా అందాల ఆరబోతకు రెడీ అవుతోంది. బిగ్‌బాస్‌ ఆశీస్సులతో హీరోయిన్‌గా మళ్లీ బిజీ అవుతోంది. ఈ క్రమంలో  ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐటం సాంగ్‌కు రెడీ అవుతోంది మోనాల్‌.

మోనాల్‌ గజ్జర్‌ బిగ్‌బాస్‌ సీజన్‌4తో పాపులర్‌ అయింది గానీ.. 8 ఏళ్ల క్రితం తెలుగు మూవీ 'సుడిగాడు'తో వెండితెరకు పరిచయమైంది. డెబ్యూ మూవీ హిట్టయినా.. తెలుగులో మూడు నాలుగు సినిమాలు చేసి ఆ తర్వాత కనిపించలేదు. సొంత భాష గుజరాతీలో కొన్ని సినిమాలు చేసినా.. క్రేజ్ దక్కలేదు. చివరికి బిగ్‌బాస్‌ పుణ్యమా అని.. ఈ  అమ్మడు వెలుగులోకి వచ్చింది.

తెలుగులో  20 సినిమాలు చేసినా.. ఇందులో ఐదు హిట్స్‌ అయినా.. రానంత క్రేజ్ బిగ్‌బాస్‌తో దక్కించుకుంది మోనాల్‌.  షోలోలో సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చి.. గ్లామర్‌  గర్ల్‌గా యూత్‌లో క్రేజ్‌ సంపాదించింది. చివరి వారం మినహా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎక్కువకాలం ఉంటూ.. ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ తీసుకొచ్చిన ఇమేజ్‌తో ఆఫర్స్‌ దక్కించుకుంది.

బిగ్‌బాస్‌ తర్వాత మోనాల్‌ సినిమా కెరీర్‌ యు టర్న్‌ తీసుకుంది. గత ఐదేళ్లుగా పట్టుమని 10 సినిమాలు కూడా చేయని మోనాల్‌ బిజీ అవుతోంది. ప్రస్తుతం హిందీ, గుజరాతీ మూవీస్‌ చేతిలో వుండగా.. ఐటంసాంగ్‌ ఆఫర్‌ వరించింది. బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న అల్లుడు అదుర్స్‌లో ఐటం గర్ల్‌గా మోనాల్‌ మెరవనుంది.  ఈ యంగ్ హీరో పక్కన  రెండుసార్లు తమన్నా ఐటం సాంగ్స్ చేయగా.. ఈ సారి ఆ ఆఫర్‌ మోనాల్‌ను వరించింది.

మొత్తానికి మోనాల్ బిగ్ బాస్ కు ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. బిగ్ బాస్ 4సీజన్ లో గ్లామర్ తో ఇంప్రెస్ చేసింది. గత ఐదేళ్లుగా 10సినిమాలు కూడా లేని మోనాల్ కు బిగ్ బాస్ తర్వాత వరుస సినిమాలు వస్తున్నాయి. అల్లుడు అదుర్స్ లో ఐటం సాంగ్ అవకాశం వచ్చేసింది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: