2020 హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్: ఈ ఏడాది అల వైకుంఠపురంలో, పుష్ప హైలైట్స్ తో బాగా ట్రెండ్ అయిన అల్లు అర్జున్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఎన్నటికి గుర్తుండిపోతాయి.. అలాంటి కాంబినేషన్ లలో బన్నీ సుకుమార్ కాంబినేషన్ ముందుగా చెప్పుకోదగినది. ఇక ఈ ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో "అల వైకుంఠపురంలో" సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంత పెద్ద హిట్ తరువాత రాబోతున్న "పుష్ప" సినిమాపై అభిమానులకి అంచనాలు తార స్థాయిలో వున్నాయి. లీకైన పోస్టర్స్ చూస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.అంతేకాదు, రీసంట్ గా సామ్ జామ్ లో బన్నీ ఇచ్చిన ఇంటర్య్వూ కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తూ హైలెట్ అయ్యింది. నిజానికి పుష్ప అనే టైటిల్ మొదట్లో ఫ్యాన్స్ కి నచ్చకపోయినా సుకుమార్ సినిమాకి ఖచ్చితంగా ఒక లెక్క ఉంటుందని అందుకే ఈ పేరు పెట్టి ఉంటాడని ఫిక్స్ అయ్యారు.ఇక ఈ సినిమా ఊర మాస్ హిట్ అవుతుందని అభిమానులు చాలా నమ్మకంగా వున్నారు. అలాగే "అల వైకుంఠపురంలో" చిత్రంతో కూడా బాగా పాపులర్ అయ్యాడు.. ఆ సినిమా పాటలు అయితే యుట్యూబ్ లో ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి.

నేషనల్ వైడ్ గా ఎంతో పాపులర్ అయ్యాయి. ప్రత్యేకంగా బుట్టబొమ్మ, రాములో రాములా, సామజవరగమన సాంగ్స్ యుట్యూబ్ ని ఒక రేంజ్ లో షేక్ చేశాయి. బుట్టబొమ్మ పాట అయితే చాలా పెద్ద హిట్ అయ్యింది.. పెద్ద హైలెట్ గా నిలిచింది.ఇక ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లో అయితే ఈ సంవత్సరంలో బాగా ట్రెండ్ అయ్యాడు అల్లు అర్జున్.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: