'ఢీ' కింగ్స్ వర్సెస్ క్వీన్స్.. వామ్మో ఇంత హాట్ డాన్స్ ఏంటి గురూ.?

praveen
ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  దాదాపు 13 సీజన్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ దూసుకుపోతుంది డాన్స్ రియాలిటీ షో ఢీ. ఇప్పుడు వరకు ఎంతోమంది కంటెస్టెంట్స్ ఢీ  షో కి వచ్చి తమ డాన్స్ ఇంప్రూవ్  చేసుకోవడంతో పాటు ఎంతోమంది డాన్స్ మాస్టర్ గా కూడా మారారు అన్న  విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఎంతోమందికి లైఫ్ ఇస్తుంది ఢీ షో. ఇటీవలే ఢీ 13 ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మొదటి ఎపిసోడ్ వచ్చింది. ఇక మొదటి ఎపిసోడ్ లో డాన్స్ చూస్తే అంతలా అట్రాక్టివ్ గా అనిపించదు.

 దీంతో ఇది మొదటి ఎపిసోడ్ కదా ఆ తర్వాత మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది అని ప్రేక్షకులు భావించారు. ఇక అనుకున్నట్లుగానే తర్వాత ఎపిసోడ్ లో ఒక రేంజ్ లో డాన్స్ ఉండబోతుంది అనేది ఇటీవల విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇటీవలే ఢీ 14 సెకండ్  ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఈ టీవీ యాజమాన్యం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా ఈ ప్రోమో ప్రారంభంలో వచ్చిన ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ప్రేక్షకులందరినీ ఆకర్షిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.

 ఇలాంటి హాట్ హాట్ పర్ఫామెన్స్ ఇప్పటి వరకు ఢీ షోలో  ఎవరూ చూసి ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ ఒక కంటెస్టెంట్ చేసిన డాన్స్ కి  అక్కడున్న టీం లీడర్స్ తో  పాటు జడ్జీలు కూడా ఫిదా అయిపోయారు ఇక ఈ ప్రోమో లో డాన్స్ చూసిన ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి.  ఇక ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ మాటల్లో చెప్పలేనంత హాట్ గా ఉంది అనే  చెప్పాలి.  ఈ పర్ఫార్మెన్స్ చూసిన  జడ్పీ ప్రియమణి ఇంత హాట్ గా చేసావ్  ఏంటి అంటూ కామెంట్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది..  కాగా పూర్తి డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసేందుకు ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: