సుశాంత్ సింగ్ సూసైడ్ కేసుపై రియా నోరు విప్పనుందా...?

VAMSI
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేసింది. చిన్న వయసులోనే ఎంతో కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన సుశాంత్ ఇక  లేరు అనే వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేక పోయారు. ఈ ఆత్మ హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది... ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు అత్యంత కీలకమైంది. సుశాంత్ తండ్రి తన కొడుకు అకాల మరణానికి రియా కు  సంబంధం ఉందని కేసు పెట్టిన విషయం తెలిసిందే.

 ఆ తర్వాత ఈ కేసు రియా చుట్టూ తిరిగింది. సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో ప్రధాన నిందితురాలు నటి రియా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత  అయితే సుశాంత్‌ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్‌ డ్రగ్‌ కేసులో రియా, తో పాటు ఆమె సోదరుడికి కూడా సంబంధాలు ఉన్నాయని వెల్లడయింది.  ఆమె సోదరుడు సోవిక్‌, సుశాంత్‌ ఇంటి మెనేజర్‌ శామ్యూల్‌ మిరాండాతో పాటు పలువురిని సెప్టెంబర్‌ 4న నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితాన్ని చవిచూసిన రియా...అక్టోబర్‌లో ముంబై కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు జైలు నుంచి విముక్తి కలిగింది.

 బెయిల్ పై విడుదల  అయినా రియా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. త్వరలో ఈ కేసు గురించి నోరు విప్పి ఈ కేసుకు సంబంధించిన కీలకమైన విషయాలను తెలిపే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితుడు దర్శకుడు రూమీ జాఫరీ రియా చక్రవర్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పినట్లు టాక్. ఆయన... జైలు నుండి విడుదలైన  రియాను కలిసినట్లు చెబుతున్నారు. జైలు జీవితం ఆమెను చాలా బాధించిందని.... ఇంకా ఆ ఆవేదన ఆమెను వీడలేదని.. వీలైనంత త్వరగా ఇవన్నీ మరచి కెరియర్ పై ఆమె దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. సుశాంత్ కేసులపై నోరు విప్పే అవకాశం కూడా ఉందని జాఫరీ చెప్పుకొచ్చారు. అయితే మరోవైపు ఈ కేసు విచారణలో దర్యాప్తును వేగవంతం చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. కాగా, నిజంగా పెదవి విప్పనుందా..??  ఇంతకీ ఏ విషయంపై ఆమె క్లారిటీ ఇవ్వనుందో అని చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: