ఆ టాలెంటెడ్ హీరో కి పిలిచి మరి అవకాశం ఇచ్చిన మెగాస్టార్...
అయితే ఆ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ సినిమాలో టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అతని ఒక పాత్ర కోసం ఫైనల్ చేసినట్లుగా టాక్. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రలో సత్యదేవ్ ను ఫైనల్ చేసినట్లుగా టాక్ వస్తోంది.
ఇదివరకే సత్యదేవ్ సినిమాలు మెగాస్టార్ చూశారు, ముఖ్యంగా బ్లఫ్ మాస్టర్ సినిమాను చూసి ఆ చిత్ర యూనిట్ ని అప్పట్లో ప్రత్యేకంగా అభినందించి బాగా మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ ఆ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వెంటనే లూసిఫర్ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఈ మలయాళం రీమేక్ తెలుగులో ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...