చూడబోతే ఇద్దరూ ఒకేసారి ఢీ కొట్టేలా ఉన్నారుగా .....??
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా నుండి మగువ మగువ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ అలానే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు మొన్న న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయిన ప్రత్యేక పోస్టర్ అన్నీ కూడా వకీల్ సాబ్ సినిమా పై పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి హిట్ కొట్టిన పింక్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్.
కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన ఒక యదార్ధ ప్రేమ కథకు దృశ్యరూపం గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు ఎంతో భారీగా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అలానే న్యూ ఇయర్ ప్రత్యేక పోస్టర్ రెండు కూడా మూవీ పై అటు ప్రభాస్ ఫ్యాన్స్ లో అలాగే ఇటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా ఎంతో శ్రమిస్తున్నారని పక్కాగా రిలీజ్ తర్వాత ఇది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని యూనిట్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా కూడా సమ్మర్ బరిలో ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. మరి ఇదే గనుక జరిగితే బాక్సాఫీస్ బరిలో అటు రెబల్ స్టార్, ఇటు పవర్ స్టార్ సినిమాలు రెండు ఢీ కొట్టడం ఖాయమని దానితో ఒకింత థియేటర్స్ విషయమై సమస్యలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు పలువురు ఆడియన్స్. అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాల విషయమై ప్రచారం అవుతున్నవి కేవలం కథనాలు మాత్రమే కాబట్టి వీటిపై అధికారికంగా ఇంకా ప్రకటనలు రావాల్సి ఉందని కావున ఈ విషయమై మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు.....!!