బెల్లంకొండ సినిమా అయినా ఆ బాలీవుడ్ హాట్ బ్యూటీకి బ్రేక్ ఇస్తుందా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఛత్రపతి హిందీ రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రీమేక్ షూటింగ్ ఇంకో రెండు నెలల్లో మొదలవుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్. ఎందుకంటే బెల్లం కొండ టాలీవుడ్ లో ఒక ఫార్ములాని ఫాలో అయ్యేవాడు. తన ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ స్టార్  హీరోయిన్స్ తో కలిసి నటించిన బెల్లం బాబు బాలీవుడ్ లో కూడా ఈ ఫార్ములా వాడి ఏ స్టార్ హీరోయిన్ తో  రొమాన్స్ చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.


ముందుగా బెల్లం బాబు సరసన  కృతిసనన్, కియారా అద్వానీ పేర్లు వినిపించినప్పటికీ.. వాళ్ళ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఇప్పుడు శ్రీదేవి తనయ జాన్వికపూర్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ, బాలీవుడ్ మీద అభిమానంతో వాటిని వదులుకున్నది ఈ అమ్మడు. అయితే.. బాలీవుడ్ లో కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆమె సినిమాలన్నీ థియేటర్ల కంటే ఎక్కువగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడంతో బాలీవుడ్ మీద ఆసక్తి తగ్గించి టాలీవుడ్ మీద పెంచింది ఈ హాట్ బ్యూటీ..

ఇక మనోళ్లు ఏమన్నా తక్కువ ఏంటి.. ఎవ్వరు ఆమె పై అంత ఆసక్తి చూపించడంలేదు. ఈ తరుణంలో ఈ హాట్ బ్యూటీకి బెల్లంకొండ సినిమాతోనైనా గుర్తింపు వస్తుందేమో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: