స్టేజ్‌పై నిధి అగర్వాల్‌కి అవమానం..!?
ఇక శింబు హీరోగా నటించిన ఈశ్వరన్ మూవీ ద్వారా నిధి అగర్వాల్ కోలీవుడ్ కి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆడియో విడుదల వేడుక ఇటీవల జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో నిధి మాట్లాడుతుండగా.. దర్శకుడు సుసీంద్రన్ పలుమార్లు ఆమెకు అడ్డుపడ్డాడు. పలుమార్లు సింబు మామ ఐ లవ్యు అని చెప్పు అంటూ ఆమెను బలవంత పెట్టాడు. దీంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇలాంటి బిహేవియర్ మంచిది కాదని, అసలు స్టేజ్ పై ఇలాంటి ప్రవర్తన ఏంటని వారు కామెంట్లు పెడుతున్నారు.
ఈ క్రమంలో దానిపై వివరణ ఇచ్చాడు ఈ దర్శకుడు. సినిమాలో శింబును ఉద్దేశించి నిధి మామా ఐ లవ్యూ అని చెప్పే డైలాగ్ ఉంటుందని.. దాన్ని దృష్టిలో ఉంచుకొనే అలా చెప్పమని చెప్పానని తెలిపాడు. కాగా గతంలోనూ ఈ దర్శకుడి పేరు పలు వివాదాల్లో వినిపించింది.