కిసాన్ గా మారబోతున్న సోనుసూద్.. ఎందుకో తెలుసా..?

praveen
కరోనా  వైరస్ కష్ట  కాలంలో హెల్పింగ్ స్టార్ గా ఆపద్బాంధవుడు గా మారిపోయాడు సోనూసూద్. మొదట వలస కార్మికులకు వసతులు కల్పించి ఇంటికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన సోనూసూద్ వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడిగా ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  కేవలం వలస కార్మికుల తోనే తన సహాయం చేసే గుణాన్ని ఆపకుండా... ఎన్నో రోజుల పాటు సహాయం కావాలి అన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.  ఇప్పటికే సోను సూద్ చేత సహాయం పొందుతున్న ఎంతోమంది సోనూసూద్ ని ఒక ప్రత్యక్ష దైవంగా కొలుస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 సినిమాలో విలన్ పాత్రలో నటించి మనిషి అంటే ఇలా మాత్రం ఉండకూడదు అని ప్రేక్షకుల చేత అనిపించుకున్న సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం సహాయం కావాలన్నా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మనిషి అంటే ఇలాగే  ఉండాలి అని అనిపించుకున్నాడు. ఇక వరుసగా పేద ప్రజలందరికీ సహాయం చేస్తూ పోతున్న సోనుసూద్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే సోనుసూద్ తాను ఇక నుంచి సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేయను అంటూ గతంలో ప్రకటించాడు. అదే సమయంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకం గా ఉండే సినిమాలను చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.



 ప్రస్తుతం కథ వింటున్నానని నచ్చితేనే సినిమా చేస్తాను అంటూ తెలిపాడు. అయితే మరికొన్ని రోజుల్లో కిసాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఇక కిసాన్ అనే సినిమాకి నివాస్ దర్శకత్వం వహించినున్నట్లు తెలుస్తోంది. రాజ్ శాండిల్య  ఈ సినిమాను నిర్వహించబోతున్నట్లు  సమాచారం. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. మరి కొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: