సినిమా: ఈ సంక్రాంతి వార్ లో ఎవరు గెలవనున్నారు...?

VAMSI
కోలీవుడ్ ఇండస్ట్రీలో కోలాహలం నెలకొంది. ఈ సంక్రాంతికి థియేటర్లు పెద్ద పండగ చేసుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో మూతపడ్డ థియేటర్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వ అనుమతితో తెరుచుకున్న విషయం తెలిసిందే. కానీ 50 శాతం సీటింగ్ తో అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. అయితే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహం నెలకొంది. తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌కు ఈ సంక్రాంతికి ఫుల్ గా సంతోషాన్ని పంచేందుకు పర్మిషన్ ఇచ్చింది. "ఇనియ పొంగల్‌ నల్‌ వాళ్తుగళ్‌" అని చెప్పింది అక్కడి ప్రభుత్వం. అంటే తమిళంలో ...తియ్యని సంక్రాంతి శుభాకాంక్షలు అని అర్థం.  ఈ పొంగల్ కు తమిళనాడులో థియేటర్స్ ఫుల్ సందడి చేయనున్నాయి.

 అయితే ఈ విషయంపై కొందరు కోవిడ్ కష్ట సమయంలో... సమస్యగా మారుతుంది ఏమో అని భావిస్తుంటే, మరికొందరు మిగిలినవన్నీ పూర్తి అన్ లాక్ లో ఉంటే థియేటర్స్ కూడా ఫుల్ సీటింగ్ తో తెరుచుకోవడం తప్పు కాదని  అభిప్రాయపడుతున్నారు. సినీ పరిశ్రమ కు తిరిగి పూర్వ వైభవం దక్కాలంటే...వంద శాతం సీటింగ్‌ కెపాసిటీతో సినిమాల ప్రదర్శన జరగాలి అని తమిళనాడు ప్రభుత్వాన్ని కోలీవుడ్ ఇండస్ట్రీ కోరింది. ఇందుకోసం తమిళ సూపర్ స్టార్ నేరుగా తమిళనాడు సీఎం పళని స్వామిని కలిశారు. ఇందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ పై పడింది. తెలుగు సినీ పరిశ్రమలోనూ... థియేటర్స్ గురించి ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌కి కూడా 100 శాతం సీటింగ్‌ అనుమతి వస్తుందా? ఈ సంక్రాంతి మన తెలుగు రాష్ట్రాలలో కూడా థియేటర్స్ ఫుల్ మీల్స్ ఇవ్వనున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 ఈ సంక్రాంతి బరిలోకి దిగేందుకు అరడజనుకు పైగా తెలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. రవితేజ ‘క్రాక్‌’, రామ్‌ ‘రెడ్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘అల్లుడు అదుర్స్‌’, విజయ్‌ ‘మాస్టర్‌’ (డబ్బింగ్‌), దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘జాంబి రెడ్డి’, ‘క్రేజీ అంకుల్స్‌’ విడుదలకు సిద్ధం గా ఉన్నాయి. అయితే ఇక్కడ మన తెలుగు నిర్మాతలు కూడా కోలీవుడ్ బాటలో పయనించి థియేటర్స్ ఫుల్ సీటింగ్ అనుమతి కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇక్కడి ప్రభుత్వం అందుకు అంగీకరిస్తుందో లేదో చూడాలి. పైగా ఎప్పటి లగే సంక్రాంతి అంటే సినిమా పరిశ్రమకు ఒక ఉత్సాహం లాగా, అయితే ఈ సంక్రాంతికి ఏ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందో అని అభిమానులు అటు సినీ వర్గాలు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: