సినీ ఇండస్ట్రీలో ఆ హీరో విలన్ గా రాణించగలడా?

Divya

సినీ ఇండస్ట్రీలో కొంత మంది మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా ఎదుగుతున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది కమెడియన్ క్యారెక్టర్స్ చేస్తూ హీరోగా ఎదిగారు. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా సరికొత్తగా ఒక యంగ్ నటుడు హీరో నుంచి విలన్గా మారబోతున్నారు. అతను ఎవరో కాదు  ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ.కార్తికేయ కేవలం నటుడు మాత్రమే కాదు కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ వ్యవస్థ నిర్వాహకులు కూడా.
కార్తికేయ మొదటిగా సినీ ఇండస్ట్రీలోకి 2017లో "ప్రేమతో మీ కార్తీక్ "అనే సినిమా ద్వారా కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో సినీ రంగ ప్రవేశం చేశాడు. తను నిర్మించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో, రెండోసారి అజయ్ భూపాల్ దర్శకత్వం వహించిన "ఆర్ ఎక్స్ 100 "సినిమాలో నటించాడు.ఈ చిత్రం  భారీ రొమాంటిక్, యాక్షన్ చిత్రంగా పేరు సంపాదించుకుంది. ఈ చిత్రం వాణిజ్యపరంగా అత్యంత విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఈ చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు కూడా తీసుకున్నాడు కార్తికేయ.
ఆ తర్వాత హిప్పి,గుణ 369,నాని'స్ గ్యాంగ్ లీడర్,90 ఎమ్ ఎల్ సినిమాలో నటించి భారీ విజయాన్ని తన అకౌంట్లో చేర్చుకున్నాడు. కార్తికేయ ఆర్ ఎక్స్ 100 సినిమా తెలుగు హిట్ అందుకోవడంతో అందరూ "ఈ  కుర్రాడు బాగున్నాడు.యాక్షన్,రొమాన్స్ చిత్రాలకు బాగా  సెట్ అవుతాడు" అని అనుకున్నాడు. అదే దారిలో వెళ్తున్నాడు కార్తికేయ. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్ ఉంది..రొమాన్స్ ఉంది.. కానీ వాటిని బలంగా ప్రజెంట్ చేసే సరైన కథే లేదు.అందువల్లే ఆ సినిమాలు  ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత కార్తికేయ లో రఫ్ లుక్, సిక్స్ ప్యాక్,ఆ రెండింటికి  తగ్గ హైట్ ఉండడంతో విలన్ పాత్రలు బాగా సెట్ అవుతాడని ఒక వార్త వినిపించింది. అదే తనువుగా నాని'స్ గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా అవకాశం వచ్చింది. ఆ సినిమాలో విలన్ గా నటించి అందరి మెప్పు పొందాడు.
తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక యంగ్ విలన్ దొరికాడని అందరూ చెప్పుకునేలా చేయడంతోపాటు, అత్యంత భారీ విజయాన్ని చేకూర్చుకున్నాడు. తెలుగులో చేసిన విలన్ రోల్స్ ఎక్కువ హిట్ అవ్వడం తో,ఇక తమిళంలోనూ కార్తికేయకు మరో విలన్ రోల్ చేసే అవకాశం వచ్చింది. తమిళంలో హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న, అజిత్ హీరోగా రూపొందుతున్న సినిమా "వలిమై". అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, అందుకోసమే కార్తికేయను సెలక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ పాత్రలో కార్తికేయ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని,ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందని అంటున్నారు దర్శక నిర్మాతలు.ఇక ఈ సినిమా  కూడా హిట్ అయితే తమిళంలో కూడా విలన్ గా కార్తికేయ సినిమాలు చేసే చాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కార్తికేయ హీరో గా చేసిన సినిమా "చావు కబురు చల్లగా" త్వరలోనే విడుదల కు సిద్ధంగా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: