సాయి పల్లవి అలాంటి పాత్ర ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
ఈ రెండు సినిమాల్లో సాయి పల్లవి డిఫరెంట్ రోల్స్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఓ స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి సిస్టర్ రోల్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. సీనియర్ స్టార్ హీరో సినిమాలో అయినా ఏమో అనుకోవచ్చు కాని ఆమె చేసేది స్టైలిష్ స్టార్ సినిమాలో సోదరి పాత్ర అని టాక్ వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాలో సాయి పల్లవి ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని అంటున్నారు. సినిమాలో ఆమె సిస్టర్ రోల్ లో నటిస్తుందని టాక్.
ప్రయోగాలు చేసేందుకు రెడీ అన్నట్టు చెబుతున్న సాయి పల్లవి స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాలో సిస్టర్ రోల్ అంటే మాత్రం ఆమె ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎంత పాత్ర బాగున్నా ఫ్యూచర్ లో బన్నీ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసే అవకాశం వస్తే అప్పుడు కష్టమవుతుందని అల్లు అర్జున్ చెల్లి పాత్రలో సాయి పల్లవిని కాకుండా వేరే ఎవరినైనా తీసుకోవాలని అంటున్నారు సాయి పల్లవి ఫ్యాన్స్. ఏది ఏమైనా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.