హిందీ వెబ్ సీరిస్‏లో హీరోగా బిగ్‏బాస్ ఫేం సోహైల్..!?

N.ANJI
బుల్లితెరపై బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో చికెన్.. మటన్.. చికెన్.. మటన్.. చికెన్..మటన్ అంటూ బిగ్ బాస్ హౌస్లో సందడి చేసిన సోహైల్‌ తెలుగు జనాల మనుసులు గెలిచాడు. బిగ్‏బాస్ సీజన్ 4 ఇంట్లో పక్కింటి అతిధిగా అడుగుపెట్టిన సోహైల్ .. తన ప్రవర్తనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఫైనల్కు చేరి టాప్–5లో మూడో స్థానంలో నిలిచిన సింగరేణి ముద్దుబిడ్డ ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ ఎంటర్ టైన్ చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఏ గుర్తింపు లేకుండా హౌస్లోకి వచ్చిన సోహైల్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ సెలబ్రెటీ అయ్యాడు. తన క్యారెక్టర్తో లక్షలాది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు.

అంతే కాకుండా ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి అభిమానాన్ని కూడా పొందాడు ఈ సింగరేణి బిడ్డ. బిగ్‏బాస్ ఫినాలే తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇప్పటికే జార్జిరెడ్డి నిర్మాత అప్పిరెడ్డి నిర్మిస్తున్న ఓ సినిమాలో సోహైల్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు వి. శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా నిర్మాత, నటుడు అచ్యుత రామారావు కూడా సోహైల్‏తో మరో సినిమా ప్లాన్ చేసినట్లుగా టాక్.

ఇక ఈ సినిమా కంటే ముందు సోహైల్ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇందులో సంజయ్ మిశ్రా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్. ఈ వెబ్ సిరీస్‏ను వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఆ వెబ్ సిరీస్‏కు “మై హూ షోలే” అనే టైటిల్‏ను ఖరారు చేశారట. దాదాపు మూడు నెలలుగా ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందట. తొందర్లోనే ఈ వెబ్ సిరీస్‏ను ప్రారంభించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: