మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి సందడి...
కొణిదెల ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవికి ఉపాసన పెద్ద కోడలు. అంతేకాకుండా అపోలో గ్రూఫ్స్ ఆఫ్ హాస్పిటల్ అధినేతకు మనవరాలు కూడా. గత ఎనిమిది సంవత్సరాల కిందట రామ్ చరణ్ ను పెళ్లి చేసుకుంది ఉపాసన. సినీ ఇండస్ట్రీలో దాంపత్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులలో రామ్ చరణ్ ఉపాసన ఎప్పుడూ ముందుంటారు. వీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో సర్దుబాట్లతో తమ జీవితాన్ని గడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే.
రామ్ చరణ్ పెళ్లికి ముందు చాలా దూకుడుతో ఉండేవాడు. కానీ ఉపాసనను పెళ్లి చేసుకున్న తర్వాత రామ్ చరణ్ జీవితంలో ఎన్నో మార్పులు సంభవించాయి. రామ్ చరణ్ అందరితో సంతోషంగా కలిసిపోవడం, దూకుడు తగ్గించడం అన్నిటికీ ఉపాసనే కారణమని చెప్పవచ్చు.ఉపాసనకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆమె కేవలం మెగాస్టార్ ఫ్యామిలీకి కోడలు మాత్రమే కాదు. అంతకుమించి... ఉపాసన అపోలో గ్రూఫ్స్ ఆఫ్ హాస్పిటల్ కి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతిరాలు అయినప్పటికీ ఎంతో సింపుల్ గా ఉంటుంది. తను ఎంతో సింపుల్ గా ఉండడం చూసి,ఉపాసన అంటే అందరికీ ఎనలేని ప్రేమ.
ఉపాసన అపోలో గ్రూఫ్స్ ఆఫ్ హాస్పిటల్ కి చైర్ పర్సన్ గా ఉంటూనే, మరోపక్క ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ, మరోపక్క కరోనా సమయంలో కరోనాకు సంబంధించిన ఎన్నో జాగ్రత్తలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరవేసింది. అంతేకాకుండా ఫ్యామిలీ గురించి కూడా జాగ్రత్తలు వహిస్తూనే వస్తోంది.కేవలం సోషల్ మీడియా ద్వారానే ఆమె ప్రజల్లో కరోనాని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని ఎలా అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇదిలా ఉండగా ఉపాసన చెల్లెలు అనుష్పాలా కామినేని. ఈమె అపోలో హాస్పిటల్ కి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోంది. అయితే గత కొద్ది కాలంగా సోషల్ మీడియా తో పాటు టాలీవుడ్లో కూడా హీరో శర్వానంద్ కు ఈమె తో పెళ్లి జరగబోతోందన్న విషయం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.అయితే ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు, కానీ త్వరలోనే అనుష్పాలా పెళ్లి పీటలు ఎక్కబోతోందన్న విషయం ఉపాసన ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ అది శర్వానంద్ తోనా లేక తన బాల్యమిత్రుడుతోనా అనే విషయం తేలాల్సి ఉంది.మరోపక్క టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టడానికి అనుష్పాలా సన్నాహాలు సిద్ధం చేసుకుంది.కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టక ముందే క్యాన్సిల్ అవడంతో ఆమె అపోలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.