'కేజీఎఫ్2' సినిమా రైట్స్ ను కొనేసిన ప్రముఖ హీరో.. ఎవరో తెలుసా..??

Anilkumar
కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు ప్రశాంత్ నీల్ ..పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా కథా, కథనాలు, దర్శకుడి పనితీరు అన్ని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాయనే చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా దాదాపు అన్ని ఇండ్రస్టీల్లో మంచి విజయాన్ని అందుకుంది.. దాంతో అగ్ర హీరోలు అందరూ ఈ దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తిని కనబరిచారు..ఇప్పుడు కె.జి.ఎఫ్ పార్ట్2 ను తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు..

దీంతో.. 'కేజీఎఫ్ చాప్టర్-2' కోసం ఈ చిత్ర అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.చాప్టర్-1తో దర్శకుడిగా ప్రశాంత్ నీల్ హీరోగా యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం ఈ స్థాయి యాక్షన్ సినిమాను ఇప్పటివరకు చూడలేదని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న 'కెజిఎఫ్ 2'లో దేశంలోని వివిధ సినీ పరిశ్రమల నటీ నటులు ఉన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.ఈ క్రమంలో సినిమా బిజినెస్ కూడా వాణిజ్య వర్గాల్లో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఈ చిత్రం కేరళ రైట్స్ ను ప్రముఖ హీరో సొంతం చేసుకున్నారు.

మలయాళ హీరో కమ్ చిత్రనిర్మాత పృథ్వీ రాజ్.. కేరళ రాష్ట్రం మొత్తానికి ఈ చిత్రాన్ని పంపిణీ చేసే హక్కులను కొనేశారు. హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్ రవీనాటాండన్ తోపాటు ప్రకాష్ రాజ్ శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా..ఈ సినిమాకి సంబంధించిన టీజర్ జనవరి 8 న విడుదల కానుంది.. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో 'సలార్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాలో ప్రభాస్ ని ఓ మాఫియా డాన్ లా చూపించబోతున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: