అల్లుడు అదుర్స్ కు నాని సెంటిమెంట్ !

Seetha Sailaja
ఈసారి సంక్రాంతి రేస్ కు టాప్ యంగ్ హీరోల సినిమాలు ఏమి విడుదల లేకపోవడంతో ఈసారి సంక్రాంతి రేస్ పై భారీ అంచనాలు లేవు. దీనికితోడు ఈసంక్రాంతి రేస్ కు రాబోతున్న సినిమాలలో ఇద్దరూ ఫెయిల్యూర్ హీరోలు కూడ పోటీ పడుతున్నారు. ఒక వైపు రవితేజా మరొక వైపు బెల్లం కొండ శ్రీనులకు ఈ సంక్రాంతి రేస్ అత్యంత కీలకం గామారింది.


ముఖ్యంగా బెల్లం కొండ తన అల్లుడు అదుర్స్’ మూవీతో చేస్తున్న సాహసం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈ మూవీని చాల గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన నాని మాట్లాడుతూ తనకు గతంలో కలిసి వచ్చిన ఒక సెంటిమెంట్ బెల్లం కొండకు కలసి రాబోతోంది అంటూ జోస్యం చెప్పాడు.



గతంలో నాని ‘అష్టాచమ్మా’ సినిమా చేసిన తరువాత తన రెండవ సినిమా గా ‘రైడ్’ అనే సినిమా చేసాడు. ఆ సినిమా కూడ నానికి మంచి పేరునే తెచ్చిపెట్టింది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అప్పట్లో బెల్లం కొండ సురేష్ నిర్మించారు. అయితే ఈ సినిమా వచ్చిన 11 సంవత్సరాల తర్వాత తాను ‘రైడ్’ సినిమాలో బలవంతంగా నటించానని నాని ‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ లాంచ్ చేస్తూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.  


తన  కెరీర్ బిగినింగ్ లో తాను నటించిన ‘రైడ్’ సినిమాలో నటించడం తనకు ఇష్టం లేదని అయితే బెల్లం కొండ బలవంతం పై  ఆ సినిమాలో నటించానని చెపుతూ అయితే ఆమూవీ బెల్లం కొండకు అప్పట్లో బాగా కలసి వచ్చిందని  ఆమూవీ ట్రైలర్ విడుదల చేసిన ప్రసాద్ లాబ్స్ లోనే ఇప్పడు 'అల్లుడు అదుర్స్' సినిమా ట్రైలర్ కూడ విడుదలైన పరిస్థితులలో అప్పట్లో తనకు కలసివచ్చిన అదృష్టం బెల్లం కొండకు కలగబోతోంది అంటూ నాని చెపుతున్న జోస్యం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: